<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారా
   యేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె

[V1]
 కలుషితమైన నదియై-నేను కడలియైననీలో
 కలిసి పోతినే-కలువరి దారిలో
 కనబడదే యిక-పాపాల రాశి // పాడెద //

[V2]
 పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయము
 పొదయైన నా హృదయములోన
 పొంగెనే అభిషేక తైలం // పాడెద //</lyrics>
<title>పాడెద నేనొక-నూతన గీతం</title>
<hymn_number>218</hymn_number>
</song>